
నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బిసి కుల వృత్తుల కోసం 9 నుండి 20 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని బిసి సంక్షేమ శాఖ ప్రకటించింది. కానీ ఆన్లైన్ బిజీతో ఒక సమస్య ఉంటే మరోవైపు కులం సర్టిఫికెట్ ఇవ్వడానికి తసీల్దార్ లు ఇబ్బందులు కల్పిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లోగల బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎక్కువగా నష్టపోయింది బిసి కులాలనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన బిసి వృత్తి కులాలకు కులం సర్టిఫికెట్ లు , ఇన్కమ్ సర్టిఫికెట్ లు త్వరితగతిన ఇవ్వాలని, ఆన్లైన్ గడువు మరో 20 రోజులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత, జిల్లా కన్వీనర్ మధు కాంబ్లే, నాయకులు శోభ,వామన్ లావు పాల్గొన్నారు.