Friday, July 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసముద్రంలో మునిగిపోయిన ఫెర్రీ.. 43 మంది గల్లంతు

సముద్రంలో మునిగిపోయిన ఫెర్రీ.. 43 మంది గల్లంతు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇండోనేసియాలోని బాలి సమీపంలో ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 43 మంది గల్లంతయ్యారు. 20 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ప్రమాద సమయంలో అందులో 65 మంది ఉన్నట్లు గుర్తించారు. 22 వాహనాలు, 14 ట్రక్కులను అది మోసుకెళ్తున్నట్లు తెలిసింది. తూర్పు జావాలోని కెటాపాంగ్‌ పోర్టు నుంచి బయలుదేరిన అరగంటకే ఈ ప్రమాదం జరిగింది. 50 కిలోమీటర్ల దూరంలోని గిలిమనుక్‌ పోర్టుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -