Friday, July 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజీపీ సెక్రటరీ వివాహేతర సంబంధం.. దేహశుద్ది

జీపీ సెక్రటరీ వివాహేతర సంబంధం.. దేహశుద్ది

- Advertisement -

రెడ్ హ్యాండ్ గా పట్టుకొని దేహశుద్ధి చేసిన కార్యదర్శి భార్య 
నవతెలంగాణ – చేర్యాల
: భార్య ఉండగా వేరొక మహిళతో సహజీవనం కొనసాగిస్తున్న పంచాయతీ కార్యదర్శిని అతని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ది చేసిన సంఘటన చేర్యాల పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. కార్యదర్శి ఏటి బాబు భార్య జ్యోతి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రానికి చెందిన ఏటి బాబు సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు.

ఆయనకు భార్య, కూతురు, కొడుకు ఉండగా భార్య అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తోంది. భార్యా భర్తల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. కొంత కాలంగా ఆంధ్రాకు చెందిన ఒక మహిళతో సహజీవనం కొనసాగిస్తూ చేర్యాల మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. భర్త పై అనుమానం వచ్చిన భార్య తన బంధువులతో కలిసి గురువారం బాబు నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వెళ్ళి ఇద్దరినీ రెడ్ హ్యండెడ్ గా పట్టుకొని దేహశుద్ధి చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఇరువురిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -