- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
మండలంలో జరుగుతున్న 06 తరగతి నుంచి 09వ తరగతి వరకు జరుగుతున్న ఎస్ఏ-02 పరీక్షలను ఎంఈఓ తరిరాము శనివారం పరిశీలించారు. టైం టేబుల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రధానంగా ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు తగు సూచనలు చేయడం జరిగింది. పిల్లల యొక్క పేపర్లను మూల్యాంకనం సరైన సమయంలో చేసి 23 వ తారీకు వరకు ఇచ్చి సహకరించగలరని తెలిపారు.
- Advertisement -