– భారత్, ఆసీస్-ఏ
– అనధికార టెస్టు
గోల్డ్‌కోస్ట్ : భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ మహిళల జట్ల ఏకైక అనధికారి టెస్టులో ఆతిథ్య ఆసీస్ అమ్మాయిలు పైచేయి సాధించారు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలకు భంగపాటు తప్పలేదు. ఆసీస్-ఏ వరుస ఇన్నింగ్స్‌ల్లో 212, 260 పరుగులు చేసింది. భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగులే చేసింది. 289 పరుగుల ఛేదనలో శుభా సతీశ్ (45), ప్రియా పూనియా (36), ఉమా చెత్రి (47), రఘ్వీ (26), సయాలి (21) మెరిసినా..92.5 ఓవర్లలో 243 పరుగులకే కథ ముగిసింది. 45 పరుగుల తేడాతో ఆసీస్-ఏ అమ్మాయిలు విజయం సాధించారు.