రెండో విడత నిజాంసాగర్ నీటి విడుదల

నవతెలంగాణ – నిజాంసాగర్
మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుండి 1000 క్యూసెక్కుల చొప్పున ఖరీఫ్ పంట సాగు నీటి కోసం రెండో విడత నీటిని పది రోజులపాటు గురువారం 12 గంటల నుండి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ ఏ ఈ ఈ శివ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 4.875 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులు నీరు తక్కువగా ఉండడం వలన రైతులందరూ కూడా నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. తూములు ఎక్కడపడితే అక్కడ తెరవకూడదని ఆయన అన్నారు. నిబంధనలను కాదని అక్రమంగా ఎవరైనా తూములు తెరిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Spread the love