Tuesday, July 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమొన్న పాకిస్థాన్..నేడు ఇజ్రాయిల్

మొన్న పాకిస్థాన్..నేడు ఇజ్రాయిల్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: దొంగ‌లంద‌రూ క‌లిసి ఊర్ల‌ను పంచుకున్న‌ట్లుగా ఇజ్రాయిల్ తీరు అద్దంప‌డుతోంది. ట్రెంప‌రీ ట్రంప్‌కు నోబెల్ శాంతి అవార్డు ఇవ్వాల‌ని ఆరాట‌ప‌డుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్వయంగా ప్రకటించారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జరిగిన సమావేశం నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ఈ క్రమంలో నోబెల్ కమిటీకి పంపిన నామినేషన్ లేఖను నెతన్యాహు ట్రంప్‌నకు అందించారు. ట్రంప్ అంతర్జాతీయంగానే కాకుండా మధ్యప్రాచ్యంలో శాంతి భద్రతల కోసం చేసిన కృషిని నెతన్యాహూ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇదివ‌ర‌కు పాకిస్థాన్ ప్ర‌భుత్వం కూడా ట్రంప్ పేరును నోబెల్ శాంతి క‌మిటీకి నామినేట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. భార‌త‌-పాక్ మ‌ధ్య తలెత్తిన ఉద్రిక్త‌త‌న‌లు నియంత్రించార‌ని కొనియాడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -