జెలెన్‌స్కీ, నెతన్యాహూలతో ట్రంప్ భేటీపై శ్వేతసౌధం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలతో మంగళవారం విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సమావేశాలు సానుకూలంగా, ఫలప్రదంగా జరిగాయని అధ్యక్షభవనం తెలిపింది. సెనెటర్ లిండ్సే గ్రహమ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇరువురు నేతలు వాషింగ్టన్ వచ్చారు. గ్రహమ్ ఇజ్రాయిల్‌కు గట్టి మద్దతుదారు. ఉక్రెయిన్‌కు అమెరికా సాయం అందించాలని ఆయన సూచించే వారు. కాగా గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసే విషయంలో సాయం చేయాలని ట్రంప్‌ను జెలెన్‌స్కీ కోరారు. అమెరికా నుంచి పాట్రియాట్ క్షిపణులను ఉక్రెయిన్ చాలా కాలం నుంచి కోరుతోంది. రష్యా డ్రోన్, క్షిపణి దాడుల నుంచి ఉక్రెయిన్ నగరాలను కాపాడుకునేందుకు ఇవి అవసరమని చెబుతోంది. మరోవైపు ఇరాన్ విషయంలో అమెరికా-ఇజ్రాయిల్ మధ్య సంబంధాలు బెడిసికొట్టిన తరుణంలో ట్రంప్‌తో నెతన్యాహూ చర్చలు జరిపారు. ఏకాంత సమావేశం బాగానే జరిగిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
ఉక్రెయిన్‌కు సైనిక సాయంపై అమెరికా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ పాట్రియాట్ క్షిపణులను దేశీయంగా తయారు చేయడానికి లైసెన్సులు ఇచ్చేందుకు ట్రంప్ అంగీకరించారని జెలెన్‌స్కీ చెప్పారు. బాలిస్టిక్ క్షిపణుల దాడిని అడ్డకోగలిగిన అతి కొద్ది గగనతల రక్షణ వ్యవస్థలలో పాట్రియాట్ ఒకటి. అయితే వీటి ధర చాలా ఎక్కువ. ఒక్కో పాట్రియాట్ ఖరీదు మూడు నుంచి ఐదు మిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది.
సానుకూలం…ఫలప్రదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



