Thursday, July 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబి.కోటేశ్వరరావు మృతికి సీపీఐ(ఎం) నేతల సంతాపం

బి.కోటేశ్వరరావు మృతికి సీపీఐ(ఎం) నేతల సంతాపం

- Advertisement -


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మౌలాలిలోని ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఎమ్‌‌టీ బేరింగ్స్ కార్మికోద్యమ నాయకుడు బి. కోటేశ్వరరావు (82) అనారోగ్యంతో మరణించడం కార్మిక, కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు టి. జ్యోతి అన్నారు. బుధవారం ఆయన భౌతికకాయంపై ఆమె ఎర్రజెండా కప్పి నివాళి అర్పించారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మేడ్చల్ జిల్లాలోని రాంపల్లిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ… కోటేశ్వరరావు చివరి క్షణం వరకు ఉద్యమంలో పని చేశారనీ, సర్వీసులో ఉన్నంతకాలం హెచ్‌‌ఎమ్‌‌టీ బేరింగ్స్ కార్మికోద్యమ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ తర్వాత నివాస ప్రాంతంలోని ప్రజాతంత్ర ఉద్యమ నిర్మాణంలో భాగస్వాములయ్యారనీ, పెన్షనర్ల సంఘంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ నిరంతరం కార్మిక సమస్యల పైన పనిచేశారని గుర్తుచేశారు. పార్టీలో తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిబద్ధతతో చివరి వరకు పనిచేశారని, వారి ఆశయాల కోసం పనిచేయడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) హైదరాబాద్ జిల్లా మాజీ కార్యదర్శి పి.ఎస్.ఎన్. మూర్తి, రాష్ట్ర సీనియర్‌ నాయకులు ‌డీజీ. నర్సింహా రావు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాధ్యులు జి. బుచ్చిరెడ్డి, ఎన్. సోమయ్య, మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి. సత్యం, హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌సిటీ కార్యదర్శి వెంకటేశ్‌, ‌హైదరాబాద్‌ ‌జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసరావు, మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె. చంద్రశేఖర్, ఎం. వినోద, జిల్లా కమిటీ సభ్యులు జె. వెంకన్న, గుంటి లక్ష్మణ్, నాయకులు ఉన్ని క్రిష్ణన్, శ్రీమన్నారాయణ, ఆదినారాయణ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -