కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహానం

నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దశాబ్ది ఉత్సవాలు కావు దగా ఉత్సవాలు అంటూ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్థానిక చౌరస్తా వద్దకు చేరుకుని అక్కడ కొద్దిసేపు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని, హామీలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింబాద్రి, జిల్లా కార్యదర్శి సురేష్ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, నాయకులు సురేష్, సాజీద్, భూమయ్య,‌‌ నర్సింలు, భీమయ్య సాయిలు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love