– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్
ఫిడె 45వ చెస్ ఒలింపియాడ్‌లో బంగారు పతకం సాధించిన భారత జట్టులో కీలక సభ్యులు అర్జున్ ఇరిగేశి, ద్రోణవల్లి హారికలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరో రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేయనుంది. బుదాపెస్ట్ నుంచి పసిడితో స్వదేశానికి చేరుకున్న అర్జున్, హారికలు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. చెస్ చాంపియన్లను అభినందించిన రేవంత్‌రెడ్డి.. చెరో రూ. 25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు ప్రసాద్ తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.