Friday, July 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమళ్లీ ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌

మళ్లీ ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధినేత కే చంద్రశేఖరరావు గురువారం మళ్లీ ఆస్పత్రిలో చేరారు. సోమాజిగూడలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు, మరిన్ని వైద్య పరీక్షల కోసం అడ్మిట్‌ అయ్యారు. ఈ నెల 3న కూడా ఆయన అదే ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పట్లో బ్లడ్‌ షుగర్‌, సోడియం స్థాయిల్ని పర్యవేక్షించేందుకు రెండ్రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఈనెల 5న డిశాó్చర్జి అయ్యారు. వారం రోజుల విశ్రాంతి అనంతరం ఇతర పరీక్షల కోసం మరోమారు ఆస్పత్రిలో చేరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -