రైతు శ్రేయస్సు కోసం పాటిపడినప్పుడే సహకార సంఘాల లక్ష్యం నెరవేరినట్టు

The goal of cooperative societies is fulfilled only when it is adhered to– అవగాహన సదస్సులో వక్తలు
నవతెలంగాణ – కంఠేశ్వర్  
రైతు శ్రేయస్సు కోసం పాటిపడినప్పుడే సహకార సంఘాల లక్ష్యం నెరవేరినట్టు అని అవగాహన సదస్సులో వక్తలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పి ఏ సి ఎస్ అధ్యక్షులకు, కార్యదర్శులకు ఒక రోజు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిలుగా మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా బోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి  మాట్లాడుతూ.. సహకార సంఘాలు అభివృద్ధి చెందాలంటే అధికారులకు పాలకవర్గాలకు మధ్య సంబంధం దగ్గరగా ఉండాలని అందరూ కలిసి పనిచేసి సంస్థను అభివృద్ధి వైపు తీసుకుపోవాలని ఆయన అన్నారు. సహకార సంఘాలు అంటే కేవలం వరి కొనుగోలు చేసి ఎరువులు అమ్మి కొనసాగించడం మాత్రమే కాదు అని కేవలం వరి కొనుగోలు ద్వారానే సంస్థల యొక్క మనుగడ కొనసాగదని ఆయన అన్నారు. సహకార సంఘాలలో ప్రతిపత్తి కాకుండా కమర్షియల్ వ్యాపారాలు చేసి సంస్థల యొక్క భవిష్యత్తును బలంగా చేయాలని ఆయన అన్నారు అదేవిధంగా రైతులకు ముఖ్యమైన సూచనలు ఎలాంటి విత్తనాలు వాడాలి ఎంత మోతాదు ఎరువు వాడాలి పొలంకు వచ్చిన రోగాలకు సంబంధించిన నివారణ చర్యలను కూడా శాస్త్రవేత్తలు మరియు అధికారులు రైతులకు తెలుపాల్సిన బాధ్యత వారి పైన ఉందని, అదేవిధంగా పంటలలో వరి మాత్రమే కాకుండా చెరుకు వంటివి కూడా సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని ఆయన అన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో ప్రతి సొసైటీలో బాధ్యతగా వ్యవహరించాలని 17 పర్సెంట్  తేమ శాతం వచ్చిన వడ్లను తీసుకోవాలని తడిగా ఉన్న ధాన్యాన్ని వాతావరణాన్ని బట్టి ఒకరోజు ఎండబెట్టి తీసుకోవాలని రైతులకు కూడా వాతావరణానికి అనుగుణంగా పంట పొలాలు కోతలు నిర్వహించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం త్వరలోనే కొనుగోలు మొదలు పెడుతుందని ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ గోదాములు అన్ని నిండిపోయాయని ఇప్పుడు కొనుగోలు చేసిన వడ్లను నిలువ చేయడానికి గోదాంలు సమకూర్చిన తర్వాత ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు.
అదేవిధంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీని త్వరలోనే తెరిపిస్తామని దాదాపు 200 కోట్ల వరకు బకాయిలను చెల్లించడం జరిగిందని రైతులు చెరుకు వైపు కూడా మోగ్గు చూపాలని చెరుకులో ఏ రకమైన విత్తనం వేస్తే ఏ విధంగా వస్తుందో శాస్త్రవేత్తలు వారికి సూచనలు తెలపాలని అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సుదర్శన్ రెడ్డి అన్నారు.  ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ.. సహకార సంఘాలు అభివృద్ధి జరగాలంటే కేవలం వరి కొనుగోలు మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలు కూడా చేయాలని ,చేపల పెంపకం కోళ్ల పెంపకం, పూల విక్రయం, పాలవిక్రయం వంటి వాటిలో సొసైటీలు పాల్గొని కొనుగోలు విక్రయాలు చేస్తే సొసైటీలకు లాభదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు. రైతుల నుండి వ్యాపారులు పాలు కొనుగోలు చేసి అధిక శాతం నీళ్లు కలిపి ప్రజలకు అందిస్తున్నారని అలా కాకుండా రైతుల నుండి సొసైటీలు పాలు సేకరించి ప్రజలకు అందించడం ద్వారా సొసైటీలకు కూడా లాభంగా ఉంటుందని, అదేవిధంగా చేపలు పెంచడంలో గాని కోళ్లు పెంచడంలో గాని సొసైటీలు తమ వంతుగా వరి కొనుగోలు చేసిన విధంగా వాటిని కూడా కొనుగోలు చేసి సప్లయర్ గా ఉండడం ద్వారా సొసైటీలకు లాభాలు చేకూరుతాయని తద్వారా సొసైటీలు బాగుపడతాయని భవిష్యత్తులో కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం కావాలన్నా ముందుండి సహకరిస్తానని ఆయన అన్నారు.  ఈ సందర్భంగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సంస్థలు అభివృద్ధి చెందాలంటే అధికారులకు పాలకవర్గాలకు మధ్య సంబంధాలు దగ్గరగా ఉండాలని ఎక్కడో జరిగే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల సహకార సంఘాల విలువలు తగ్గిపోతున్నాయని ,కానీ నిజానికి సహకార రంగాల పాత్ర ఎంతో కీలకమైనదని ఆయన అన్నారు.
అదేవిధంగా సహకార సంఘాలు ఆర్థికంగా బలంగా కావాలంటే కేవలం వరి కొనుగోలుపై ఆధార పడకుండా ఇతర వ్యాపారాలు చేసి సంస్థను లాభాదాయకంగా చేయొచ్చని, కావున కామన్ సర్వీస్ సెంటర్లు ప్రతి సొసైటీలో ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తూనే సంస్థకు ఆర్దిక లాభం సమకూర్చే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని, అందులో భాగంగా నవంబర్ 30వ తేదీన హైదరాబాద్ మరియు వరంగల్ శిక్షణ కేంద్రాలలో సొసైటీ కంప్యూటర్ ఆపరేటర్లకు కామన్ సర్వీసింగ్ సెంటర్ పై ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుందని. దీనికి ప్రతి సొసైటీ నుండి కంప్యూటర్ ఆపరేటర్లను ఆయా సొసైటీ అధ్యక్షులు విధిగా పంపించాలని అందరం కలిసి సహకార రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్దామని మానాల మోహన్ రెడ్డి తెలిపారు.సీ ఎస్ సి ద్వారా సేవలు అందించడం ద్వారా సొసైటీలు ఆర్థికంగా లబపడటమే కాకుండా సొసైటీ పరిధిలోని వారికి సేవలు అందించే విధంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి ,డిసిఎంఎస్ చైర్మన్ తార చంద్ , మార్క్ఫెడ్ చైర్మన్ మర గంగారెడ్డి, వ్యవసాయ కమిషన్ మేంబర్ గడుగు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఎండి అన్నపూర్ణమ్మ,డిసిసిబి డైరెక్టర్లు,డిసిఎంఎస్ డైరెక్టర్లు, వివిధ సొసైటీల అధ్యక్షులు కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.
Spread the love