జిల్లా అభివృద్ధికి, రైల్వే సంస్థకు, కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించాలి 

– సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుల డిమాండ్

నవతెలంగాణ కంఠేశ్వర్
జిల్లా అభివృద్ధికి రైల్వే సంస్థకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సిపిఎం పార్టీ రెండవ రోజు రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా బోధించటానికి వచ్చిన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు నిధులను కేటాయించాలని జిల్లా వ్యవసాయ అభివృద్ధిలో ముందుకు పోవాలంటే రైల్వే రంగానికి ఆర్మూర్ నుంచి అదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేయటానికి బోధన్ టు బీదర్ రైల్వే లైన్ ఏర్పాటు కొరకు నిజాంబాద్ నుండి హైదరాబాద్ డబల్ గేజ్ లైన్ నిర్మాణానికి తగిన నీ నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేటాయించాలని అప్పుడే ఈ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన వారవుతారని ఆయన తెలిపారు. గత ఎన్నికల కన్నా ముందు నిజాంబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్న పసుపు బోర్డును ఐదు సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేయకపోగా ఎన్నికల కన్నా ముందు ప్రధానమంత్రి తో మరొకసారి ప్రకటన చేయించి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలిచిన ఈ కాలంలో కూడా జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టకపోవడంతో జిల్లా రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనేక సందర్భాల్లో గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారని అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పాటుకు వెంటనే చర్యలు తీసుకొని కేటాయించాలని డిమాండ్ చేశారు. జక్రాన్ పల్లి ప్రాంతంలో ఏర్పాటు చేస్తామన్న విమానాశ్రయానికి భూమి కేటాయింపు జరిగినప్పటికీ నిధులను కేటాయించకుండా నిర్లక్ష్యం చేయటం సరైనది కాదని వెంటనే నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్లాసుల్లో పార్టీ జిల్లా నాయకులు సురేష్, విగ్నేష్, సుజాత, నన్నే షాప్, గంగాధర్, సాయిలు, ఎల్లయ్య, శ్రీనివాస్ తదితరులతోపాటు పాల్గొన్నారు. అనంతరం పార్టీ విధానాలకు ఆకర్షితులై పార్టీ ప్రజా సంఘాల్లో పనిచేయటానికి అడ్వకేట్ మంజిత్ సింగ్ సిపిఎం పార్టీలో చేరటం జరిగింది.
Spread the love