- Advertisement -
- – ప్రజాసేవే పరమావధిగా యువత రాజకీయాల్లోకి రావాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- నవతెలంగాణ – వేములవాడ
- “యూత్ ఇన్ పాలిటిక్స్” అనే అంశంపై రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో ఈ ఆదివారం, జులై 20న సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశం యొక్క గోడపత్రికలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాసేవే పరమావధిగా నేటి యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో చైతన్యం నింపుతాయని, కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బుర్ర రవితేజ గౌడ్, నరేష్ నాయక్, బొర్రా రవీందర్, జితేందర్ రెడ్డి, సాయికుమార్, కార్తీక్, విశాల్, నాగరాజు, ప్రణీత్ పాల్గొన్నారు.
- Advertisement -