Sunday, July 20, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జాన్సన్ నాయక్  చిత్ర పటానికి క్షీరాభిషేకం.

జాన్సన్ నాయక్  చిత్ర పటానికి క్షీరాభిషేకం.

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలం కలమడుగులో గ్రామంలో శనివారం  బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు జంగం సంతోష్  ఆధ్వర్యంలో బిఆర్ఎస్  పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్య జాన్సన్ నాయక్  చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖానాపూర్ నియోజకవర్గంలో యువత 1000 మందికి పైగా నిరుద్యోగులకు ప్రయివేటు ఉద్యోగాలు కల్పించి, వారి కుటుంబాలకు అండగా నిలిచిన మహా నేత జాన్సన్ నాయక్ అన్నారు.

ఖానాపూర్  నియోజకవర్గంలో యువతకి ప్రయివేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడంలో జాన్సన్ నాయక్ చేసిన సేవలు అభినందనీయమన్నారు. జాన్సన్ నాయక్ లాంటి నాయకున్ని రాబోయే రోజుల్లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇక్కడ యువతకు ప్రజలకు  మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇలాంటి నాయకునికి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో కలమడుగు నర నారాయణస్వామి ఆలయ కమిటీ చైర్మన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు స్వదేశ్ రావు, జక్కుల శ్రీను,పెద్దోళ్ల శంకర్,దేవేందర్, బుచ్చన్న,రాజేశం,అంజి,గోపి,ఇమ్రాన్,ఉదయ్, కిరణ్,రవి,సత్తాన్న,మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -