- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సీఎం సూచించినట్లు ఆమె తెలిపారు. కామారెడ్డిలో పార్టీ పరిస్థితిని సీఎం అడిగి తెల్సుకున్నారని ఆమె తెలిపారు. కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
- Advertisement -