ఏ ఎం హెచ్ ఓ డాక్టర్ వెంకటరమణ ను కలిసిన ఆనంద్ కుమార్ గౌడ్..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
జిహెచ్ఎంసి గోషామహాల్ సర్కిల్ -14 కార్యాలయంలో ఏఎంహెచ్ ఓ డాక్టర్ వెంకటరమణ మర్యాద పూర్వ కంగా కలిసి గోషామహల్ లో నెలకొన్న వివిధ సమస్యలపై వినతి పత్రం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు ఆనంద్ కుమార్ గౌడ్. అనంతరం ఆయన  మాట్లాడుతూ.. గోషామహల్ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ బదిలీ అయి వారం రోజులు గడిచిన పూర్తిస్థాయి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ను నేటికీ నియమించలేదని, దీంతో గోషామహల్ పరిధిలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. స్ట్రీట్ లైట్లు వెలగక బస్తీలన్నీ చీకట్లో మగ్గుతున్నాయని, కనీసం కొత్త స్ట్రీట్ లైట్లు కూడా వేయించలేని దుస్థితిలో ప్రభుత్వం కొనసాగుతుందని అన్నారు. కనీసం మూత్రశాలలు కూడా కొనసాగించలేని అసమర్థ ప్రభుత్వం పాలన సాగుతుందని విమర్శించారు. గోషామహల్ నియోజకవర్గలో అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిందని, అధికా రులు నిద్రమత్తులో జోగుతున్నారని, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందని అన్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పూర్తిస్థాయి డిప్యూటీ మున్ని పల్ కమిషనర్ ను నియమించాలని, అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ ముదిరాజ్, నరేష్ గౌడ్, మహేష్ గౌడ్, అహ్మద్ భాయ్, రాకేష్ సింగ్, శేఖర్, చింటూ తదితరులు పాల్గొన్నారు.
Spread the love