జిల్లా పౌర సరఫరాల పాలన సంస్థ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు…

– ప్రత్యేక నెంబర్ కేటాయింపు…9281423621
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
యాసంగి 2024-25 సీజన్లో ధాన్యం సేకరణ సజావుగా జరిపేందుకు జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో కాల్ సెంటర్ ను  జిల్లా పౌరసరపరాల సంస్థ అధికారి వనజాత బుధవారం ప్రారంభించారు. ఈ  సందర్భంగా ఆమె  మాట్లాడుతూ యసంగి 2024-25 సీజన్ ధాన్యం సేకరణ కు అధికార యంత్రాంగం అన్ని చర్యలను తీసుకుంటుందనీ, ఇప్పటికే ప్రతిపాదించిన 372 కేంద్రాలలో 25 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయనీ తెలిపారు. ఈ పంట కాలంలో అధిక దిగుబడి రానున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ధాన్యం సేకరణలో నిమగ్నమయ్యారు.
గత సీజన్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, కలెక్టరేట్ లోని, జిల్లా పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  దానికి గాను ప్రత్యేకంగా ” 9281423621 ” నెంబర్ కేటాయించి, పిర్యాధుల కోసం కొనుగోలు కేంద్రాల ఏజెన్సీ ల ప్రతినిధులు, పౌర సరఫరాల సిబ్బంది, రవాణా కాంట్రాక్టర్ ల నుండి ఒక ప్రతినిధిని కేటాయించారు. ఇట్టి కాల్ సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోళ్లు, రవాణా, చెల్లింపులు తదితర విషయాలపై ఎలాంటి సందేహాలు మరియు పిర్యాదులు ఉన్న సత్వర పరిష్కారం దొరుకుతుందని జిల్లా మేనేజర్ హరికృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమములో జిల్లా మేనేజర్ హరికృష్ణ, సహాయ పౌర సరఫరాల అధికారి రోజా రాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీధర్, మరియు జిల్లా వ్యవసాయ అధికారిణి నీలిమ పాల్గొన్నారు. వీరితోపాటు జిల్లాలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, ఇతర అధికారులు హాజరయ్యారు.
Spread the love