– ఐటీటీఎఫ్ వరల్డ్‌కప్ 2025
మకావు (చైనా) : భారత టేబుల్ టెన్నిస్ స్టార్స్ మనిక బత్ర, ఆకుల శ్రీజ ఐటీటీఎఫ్ 2025 ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచ్‌లో శుభారంభం చేశారు. గ్రూప్-16లో పోటీపడుతున్న మనిక బత్ర తొలి గేమ్‌లో 11-1, 11-2, 11-6, 11-4తో మేలిస్‌పై గెలుపొందగా.. గ్రూప్-9లో వరల్డ్ నం.34 ఆకుల శ్రీజ 11-9, 11-4, 11-8, 6-11తో ఆస్ట్రేలియా అమ్మాయిపై విజయం సాధించింది. గ్రూప్ దశ1లో ప్రతి ప్లేయర్ నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. గెలుపోటముల శాతం ఆధారంగా గ్రూప్ విజేత ముందంజ వేస్తారు. టేబుల్ టెన్నిస్ ప్రపంచకప్‌లో మనిక, శ్రీజ మాత్రమే భారత్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పురుషుల విభాగంలో ఎవరూ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేదు.