పుస్తకాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా “లుక్ ఏ బుక్”

KU నవతెలంగాణ – కాకతీయ యూనివర్సిటీ, హన్మకొండ: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది పుస్తక పఠనం తగ్గుతుందనీ లుక్ ఏ బుక్ వ్యవస్థాపకులు, రచయిత హథీరాం సబావత్ అన్నారు. విశ్వంభర ఫౌండేషన్ మరియు లుక్ ఏ బుక్ సంయుక్త ఆద్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో ఓపెన్ రీడింగ్ క్లబ్ ని ఏర్పాటు చేశారు.
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు సోషల్ మీడియా ప్రభావంతో పుస్తకానికి దూరమైనారు. అందరికీ పుస్తకాన్ని చేరువ చేయడమే ఉద్దేశంగా లుక్ ఏ బుక్ స్థాపించమని చెప్పారు. విశ్వంభర ఫౌండేషన్ సమన్వయ కర్త అమర్ నాథ్. లింగంపల్లి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి పిల్లలకు కథల ద్వారా సాహిత్య పరిచయం చేసేవారు. అది ఇప్పుడు చాలా తగ్గిపోయింది. కెరీర్ పుస్తకాలే లక్ష్యంగా చేసుకున్న యువతకు సాహిత్యం కొంత ఆలోచనను కలిగిస్తుంది. పుస్తకం పఠనం ద్వారా పాఠకుల ఊహా శక్తి పెరుగుతుంది. యువతని పుస్తక ప్రియులుగా మార్చడమే లక్ష్యంగా రీడింగ్ క్లబ్ ని ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ రచయిత ఉదయ్, జాహ్నవి, వంశీ, శివ కుమార్ నాస్తిక్ పాల్గోన్నారు

Spread the love