- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ మధుసూదన్ మొక్కలను నాటి నీళ్ళు పోశారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలకు సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై సబిత, పంచాయతీ కార్యదర్శి బాబు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్, ఉపాధ్యక్షులు సత్యం, జనరల్ సెక్రెటరీ ప్రకాష్ గౌడ్, మాజీ సర్పంచ్ నర్సింలు యాదవ్, అమీన్, ప్రవీణ్ గౌడ్, కార్తీక్, రమేష్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
- Advertisement -