- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి శ్రీ కృష్ణుని జన్మదిన సందర్భంగా గురువారం అక్షర ఉన్నత పాఠశాలలో ముందస్తు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ” కన్నయ్య ను” ఊయలలో పడుకోబెట్టి జోల పాట పాడుతూ గోపికలు నృత్యం చేశారు. చిన్ని కృష్ణుడికి పళ్ళు, వెన్న, మీగడ, అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించారు. చిన్నారులు గోపిక శ్రీ కృష్ణుడి వేషధారణలతో చూపరులను ఆకట్టుకున్నారు. దాండియా, కోలాటం ఆడుతూ, గీతాలను ఆలపిస్తూ ఉట్టి కొట్టుట తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ లోకేశ్ రెడ్డి, సంగీతారెడ్డి, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -