- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బిగ్‌బాస్ ఓటీటీ(హిందీ) సీజన్-2 విజేత, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో గురుగ్రామ్‌లోని ఎల్విష్ ఇంటి వద్దకు ముగ్గురు గుర్తు తెలియని దుంగడులు బైక్‌పై వచ్చారు. కాసేపు అక్కడ తచ్చాడి.. ఎల్విష్ నివాసంపై పన్నెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫోరెన్సిక్ బృందాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు.
- Advertisement -