- Advertisement -
నవతెలంగాణ – చిన్న శంకరంపేట
మండలంలోని ఎస్ కొండాపూర్ గ్రామం మధిర పేట గడ్డకు చెందిన మాడబోయిన నర్సింలు కుమారుడు స్వామి (20) డెంగ్యూతో సోమవారం రాత్రి మృతిచెందాడు. మూడు రోజులుగా డెంగ్యూతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం మెదక్ ప్రయివేట్ దవాఖానలో చికిత్స తీసుకున్నాడు. రక్త కణాలు తగ్గడంతో సోమవారం రాత్రి మృతి మృతిచెందాడు. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. గత వారం రోజుల క్రితం మరో వ్యక్తి మాడవైన షేకులుకు డెంగ్యూ వ్యాధి శోకడంతో హైదరాబాదులోని ప్రైవేట్ దవఖానలో చికిత్స పొంది మెరుగుపడ్డాడు. గ్రామంలో వైద్యులతో క్యాంపు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -