Monday, May 5, 2025
Homeతెలంగాణ రౌండప్భగీరథుడి స్పూర్తితో సగరులు అభివృద్ధి చెందాలి 

భగీరథుడి స్పూర్తితో సగరులు అభివృద్ధి చెందాలి 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర: శ్రీ భగీరథ మహర్షి స్ఫూర్తితో సగరులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్ర శర్మ, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దుంపల సమ్మయ్య అన్నారు. భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి ప్రజలకు వరంగా అందించిన మహా రుషి భగీరథ మహర్షి అని కొనియాడారు. కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్ని అయినా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్ కుమార్, మండల అధ్యక్షుడు దుంపల వేణు సాగర్, మండల ప్రధాన కార్యదర్శి కూతురు అనుదీప్, నాయకులు కూతురు బుచ్చయ్య, కూతురు కృష్ణయ్య, కూతురు దేవయ్య, కూతురు మహేష్, కూతురు నరేష్, కూతురు సతీష్, కూతురు సందీప్, కూతురు చిన్న వెంకట రాములు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -