- Advertisement -
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న పిఆర్టియు టీఎస్ మహా ధర్నా పోస్టర్లను పిఆర్టియు మండల అధ్యక్షులు జగదీష్, స్థానిక పిఆర్టియు నాయకులతో కలిసి విడుదల చేశారు. అనంతరం పిఆర్టియు మండల అధ్యక్షులు జగదీష్ మాట్లాడుతూ.. పియారిటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నను పెద్ద ఎత్తున టీచర్లు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పిఆర్టియు కార్యదర్శి కిషోర్, రాష్ట్ర పిఆర్టియు ఉపాధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.
- Advertisement -