No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ సేవలు అందించండి ..

ఉత్తమ సేవలు అందించండి ..

- Advertisement -

– మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
పదోన్నతులు పొంది వివిధ పాఠశాలలో చేరిన ప్రధానోపాధ్యాయులు మరిన్ని ఉత్తమ సేవలు అందించాలని మండల విద్యాశాఖ అధికారి నేర  ఆంధ్రయ్య అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి జగిత్యాల జిల్లా తక్కళ్లపెల్లికి ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతిపై  వెళ్లిన లక్ష్మి నర్సయ్యకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా హాస కొత్తూరు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పదోన్నతిపై వచ్చిన అరుణ శ్రీ కి  స్వాగతం కార్యక్రమాన్ని మండల విద్యా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఆంధ్రయ్య మాట్లాడుతూ ఎక్కడ పని చేసినా విద్యార్థుల శ్రేయస్సు లక్ష్యంగా కృషి చేయాలని, తద్వారా ఆయా గ్రామాలకు మండలాలకు మంచి పేరు తేవాలని కోరారు. అనంతరం ఇరువురిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో   పిఆర్ టియు ప్రధాన కార్యదర్శి అంజాద్ సుల్తాన్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు కిషన్, యుటిఎఫ్ అధ్యక్షులు రాజేశ్వర్, ఎస్ జి టి యూనియన్ అధ్యక్షులు ప్రసాద్, మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad