Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్190 పోలింగ్ కేంద్రాలలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం

190 పోలింగ్ కేంద్రాలలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – జడ్చర్ల
భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జూన్ 25 నుంచి ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) – ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని 3వ వార్డుకు చెందిన 190 పోలింగ్ కేంద్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చేయడం, అలాగే అనర్హుల పేర్లను తొలగించడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సవరణ ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాలను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా బూత్ లెవల్ ఏజెంట్ (BLA) మండల రఘు ముదిరాజ్ (కాంగ్రెస్ పార్టీ) మరియు బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) సునీత  పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఓటరు జాబితా సవరణ పనులను పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులతో కలిసి కార్యక్రమం పురోగతిని సమీక్షించి, అవసరమైన సూచనలు అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓటరు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని, కొత్తగా అర్హత పొందిన వారు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే పేరు, చిరునామా, ఇతర వివరాల్లో మార్పులు ఉన్నవారు వాటిని సరిచేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు, సంబంధిత అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -