- Advertisement -
– మదర్‌థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ వైద్యులు
నవతెలంగాణ-హైదరాబాద్
తన సేవలతో అందరికీ అమ్మ అయిన మదర్‌థెరిస్సా సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని మదర్‌థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ వైద్యులు జి స్వరూప రాణి, సల్మాన్ రాజ్ అన్నారు. మదర్‌థెరిస్సా 115వజయంతి సందర్భంగా గురువారం ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పలువురికి విడో పింఛన్లు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుష్ఠు బాధితులకు ఆమె అందించిన సేవలు మరువలేనివన్నారు. ప్రతిఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మోసెస్, ఎడ్వర్డ్, డే విడ్, ప్రసాద్, గిరిజ, మేఘన తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -