- Advertisement -
- – బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
నవతెలంగాణ – డిండి: డిండి మండలం దాసరినెమిలిపూర్ గ్రామ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త డాక్టర్ గంగిడి వెంకట్ రెడ్డి మృతి బాధాకరం అని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం వెంకట్ రెడ్డి మృతి దేహం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….వెంకట్ రెడ్డి మృతి గ్రామ ప్రజలకు తీరని లోటు అన్నారు. వెంకట్ రెడ్డి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు రాజనేని వెంకటేశ్వరరావు, ఉప్పుగంటి ప్రశాంత్ రావు, మాజీ మండల కో- ఆప్షన్ సభ్యులు ఎండి. జాంగీర్,మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, ప్రవీణ్ రావు, పసునూరి వెంకటయ్య, పసునూరు హనుమంతు, షేక్ బషీర్, పసునూరి తిరుపతయ్య, బొడ్డుపల్లి హనుమంతు, పసునూరి శ్రీను, తదితరులు ఉన్నారు.
- Advertisement -