- Advertisement -
భారతి సిమెంట్ వెల్లడి
హైదరాబాద్ : సిమెంట్ ధరలను తగ్గిస్తామని భారతిసిమెంట్ కార్పొరేషన్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సిమెంట్‌పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ విధానం లక్షలాది మంది గృహనిర్మాణదారులు, మౌలిక సదుపాయాల డెవలపర్లు, సాధారణ పౌరులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు.
- Advertisement -