- Advertisement -
మున్సిపల్ కమిషనర్ కే. రమేష్ కుమార్
నవతెలంగాణ- దుబ్బాక
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రభుత్వ సూచనలను పాటిస్తూ తమ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని, తద్వారా బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని మున్సిపల్ కమిషనర్ కల్యాణం రమేష్ కుమార్ అన్నారు. గురువారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి 5 వ వార్డులో లబ్ధిదారులు డీ. రేఖ, ఒగ్గు రేణుక లు చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్ని హౌసింగ్ ఏఈ జాహ్నవి తో కలిసి ఆయన పరిశీలించి ఇళ్ల కొలతల్ని సేకరించారు. వారి వెంట వార్డు ఆఫీసర్లు మహేష్, నవీన్, చంద్రయ్య ఉన్నారు.
- Advertisement -