- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అబ్బినవేని దేవిక (45) అనే మహిళ విషజ్వరంతో గురువారం రాత్రి హన్మకొండ ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లుగా మృతురాలు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి పూర్తి కథనం ప్రకారం దేవికకు గత మూడు రోజులు జ్వరం రావడంతో మొదటగా భూపాలపల్లి ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించి బ్లడ్ ఇన్ఫెక్షన్,విషజ్వరం సోకిందని హన్మకొండ రెపర్ చేయగా అక్కడి వైద్యులు పరీక్షించి హైదరాబాద్ రెపర్ చేశారని తెలిపారు. ఆస్పత్రికి వెళుతుండగా మార్గంమధ్యలోనే మృతిచెందినట్లుగా పేర్కొన్నారు.
- Advertisement -