- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
మండల కేంద్రంలోని సాందీపని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బతుకమ్మ సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, విద్యార్థినిలు, ఉపాధ్యాయురాలు బతుకమ్మను ఆడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోగుల రాములు, ఉపాధ్యాయులు గట్టిగొర్ల యాదగిరి, నిమ్మనగోటి వెంకటప్రసాద్,శంకర్, రేణుక,పద్మ, ఆకాంక్ష,శిరీష, విజయలక్ష్మి, శ్రీలేఖ్య ఉన్నారు.
- Advertisement -