- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండలం పెద్దతూoడ్ల గ్రామంలోని శ్రీహనుమాత్సహిత రాజరాజేశ్వరి ఆలయంలో ప్రతిస్థాపించిన దుర్గాదేవి మండపంలో గురువారం నాలుగవ రోజు శ్రీకాత్యాయని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చినట్లుగా ఆలయ కమిటీ తెలిపింది. దుర్గాదేవి మండపం వద్ద పూజ అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. అమ్మవారిని దర్షించుకొవాడానికి చుట్టు ప్రక్కల గ్రామాల సందర్శకులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులై,తీర్థ ప్రసాదం స్వీకరించారు.
- Advertisement -