- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ పరుపుల తయారీదారు సెర్టా తెలంగాణలో తన తొలి సెర్టా షోరూంను ఏర్పాటు చేసింది. నగరంలోని ఖాజాగూడలో ఏర్పాటు చేసిన దీనిని శుక్రవారం సెర్టా ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితిన్ గుప్తా లాంచనంగా ప్రారంభించారు. వచ్చే 12 నెలల్లో హైదరాబాద్‌లో మరో ఐదు ప్రత్యేక షోరూంలు తెరువాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నితిన్ గుప్తా తెలిపారు. రెండేళ్లలో భారత్‌లో 100 అవుట్‌లెట్‌లకు విస్తరించాలని నిర్దేశించుకున్నామన్నారు. వచ్చే ఏడాదిలో రూ.200 కోట్ల టర్నోవర్ అంచనా వేస్తోన్నామని తెలిపారు.
- Advertisement -