- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీ అలాగే హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీలలో ఆదివారం దుర్గామాత విగ్రహాల వద్ద భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. రెండు చోట్ల నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో గ్రామస్తులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేవి నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత విగ్రహాల వద్ద నిర్వాహకుల ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాలు జరిగాయి.
- Advertisement -