- Advertisement -
స్థానిక ఎన్నికల సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్ వీరా రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాల ఎన్నికలకు 2025 గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సహాయ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి ప్రారంభించారు. ఈ సహాయ కేంద్రానికి అధికారిగా డివిజనల్ పంచాయతీ అధికారి ప్రతాప్ నాయక్ ను నియమించారు. హెల్ప్ డెస్క్ నెంబర్ 8978928637, ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి, డిప్యూటీ జెడ్పి సీఈవో డి విష్ణువర్ధన్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్ , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -