- Advertisement -
నవతెలంగాణ- దుబ్బాక
దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీకగౌడ్.. పలుచోట్ల ఏర్పాటుచేసిన దేవి మండపాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మండల పరిధిలోని హబ్సిపూర్ లో మహంకాళి యూత్, మున్సిపల్ కేంద్రంలోని 14 వ వార్డులో శ్రీ నవదుర్గ యూత్, 20 వ వార్డులో యువ కిరణ్ స్పోర్ట్స్ అసోసియేషన్ మండపాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కార్తీక గౌడ్ పాల్గొని అన్న ప్రసాద వితరణ చేశారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు కొత్త దేవిరెడ్డి, కామోజీ అనురాధ, పలు యూత్ అసోసియేషన్ సభ్యులున్నారు.
- Advertisement -