- Advertisement -
- ప్రకటించిన న్యాయవాది గటడి ఆనంద్
నవతెలంగాణ-ఆర్మూర్: క్షత్రియ కులస్తులకు కోర్టు కేసులలో ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా వాదిస్తానని పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, సేవా తత్పరుడు, ఆర్టిఐ జిల్లా కన్వీనర్, వివిధ బ్యాంకుల సలహాదారుడు గటడి ఆనంద్ శుక్రవారం ప్రకటించారు. పట్టణంలోని చిన్న బజార్ వద్ద గల శ్రీ లక్ష్మీనారాయణ మందిరంలో దుర్గాదేవి నవరాత్రి విజయదశమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ క్షత్రియ కులస్తులకు ఎటువంటి కేసులైన ఉచితంగా వాదిస్తానని తెలిపారు. గత నాలుగు సంవత్సరాల నుండి ఉచిత నోటరీ సేవలు అందిస్తున్నారు. అలాగే దసరా సందర్భంగా క్షత్రియులకు ఎటువంటి కేసులైనా ఉచితంగా వాదిస్తానని, క్షత్రియులు వినియోగించు కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రెడ్డి ప్రకాష్, కార్యదర్శి బారడ్ గంగా మోహన్, ఉపాధ్యక్షులు జెస్సు ఆనంద్, యువజన సమాజ్ అధ్యక్షులు సంతోష్, పడాల్ గణేష్, ఖాoదేష్ శ్రీనివాస్, బొబిడే కిషన్, మాణిక్ ప్రవీణ్, దొండీబుడ్డు శ్రీనివాస్, జైరాం నందు, ఎస్ జి శ్రీనివాస్, బారడ్ బాలాజీ, గుజరాతి మోహన్ , సంఘ సభ్యులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -