- Advertisement -
*స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ
నవతెలంగాణ-రామారెడ్డి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై శుక్రవారం మాజీ ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు, మండల ప్రధాన కార్యదర్శి సలావత్ బుచ్చిరెడ్డి అధ్యక్షతన మండలంలోని రెడ్డి పేటలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. జెడ్పిటిసి తోపాటు, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ పై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు రాజా గౌడ్, సర్పంచుల ఫోరం, మాజీ అధ్యక్షుడు బొమ్మిడి రాంరెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు సునంద ప్రభాకర్ రావు, గంగావత్ రాజు, హనుమాన్లు, గజ్జల శంకర్, రాజు, లింబాద్రి, నంద, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -