– ఆశావహుల మధ్య ఆధిపత్య పోరు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్‌పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతూనే వుం ది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ వరం గల్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి రవీంద్ర ఉత్తమ్ రావుదాళ్వి శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ వి స్తృతస్థాయి సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశా ల్లోనే పార్టీ టికెట్‌నాశిస్తున్న నేతలు బలప్రదర్శనకు దిగడం గమనార్హం. వరంగల్ తూర్పు, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల పార్టీ సమావేశాల్లో పోటాపోటీ నినాదాలతో సమావేశాలను రసాభాస చేయ డం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశాల పరిస్థితి ఇలా వుంటే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ఖరారు చేయ డంలో హైద్రబాద్‌లో పిసిసి ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ క మిటీలు సమావేశాలు నిర్వహించాయి.
కాంగ్రెస్‌పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ టికెట్ లను ఆశిస్తున్న నేతలు కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెం టు నియోజకవర్గ ఇన్‌ఛార్జి రవీంద్ర ఉత్తమ్‌రావు దాళ్వి ఆ ధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో ఆధిపత్య పోరుకు దిగారు. దీంతో పలు నియోజకవర్గాల్లో పార్టీ విస్తృతస్థాయి సమావే శాలు మొక్కుబడిగానే జరిగాయి. హడావుడిగా ప్రసంగించి సమావేశాలను ముగించి ఇన్‌ఛార్జి వెనుతిరగడం గమనా ర్హం. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వున్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృ తస్థాయి సమావేశాలు గందరగోళంగా మారాయి. పలు ని యోజకవర్గాల్లో సమావేశం అర్థాంతరంగా ముగించి వెళ్లిన సందర్భాలు లేకపోలేదు.
నేతల మధ్య ఆధిపత్య పోరు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల నియోజకవర్గ స మావేశంలో పార్టీ టికెట్‌నాశిస్తున్న కొండా మురళీధర్‌రావు మీసం మెలేస్తే, ఇనుగాల వెంకట్రాంరెడ్డి తొడకొట్టడం, రెండుగ్రూపులు పోటాపో టీ నినాదాలు చేసుకుంటుండడం తో అ ర్ధాంతరంగా సమావేశాన్ని ముగించి ఇన్ ఛార్జి రవీంద్ర ఉత్తమ్‌రావు దాళ్వి వెళ్లిపో యారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో నూ టీపీసీసీ కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీని వాస్, కేఆర్.నాగరాజు గ్రూపుల మధ్య పోటాపోటీ నినాదాలు చేయడంతో స మావేశం రసాభాసగా మారింది. ఇటీవలె కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఐపిఎస్ అధికారి కేఆర్.నాగరాజును వేదిక మీద కు పిలవాలని నినాదాలు చేయడంతో ఆయన్ను వేదిక పైకి ఆహ్వానించారు. దీంతో ‘నమిండ్ల’ అనుచరులు వ్యతిరే కం గా నినాదాలు చేశారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో సింగపురం ఇం దిర, దొమ్మాటి సాంబయ్య అనుచరుల మధ్య పోటాపోటీ నినాదాలు చేయడం సమావేశం గందరగోళంగా మారిం ది. పాలకుర్తి నియోజకవర్గ సమావేశంలో పార్టీ టికెట్‌నా శిస్తున్న ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, ఎర్రంరెడ్డి తిరు పతిరెడ్డిల అనుచరులు పరస్పరం నినాదాలు చేయడం సమావేశంలో గందరగోళం నెలకొంది.
కాంగ్రెస్ తొలి జాబితా …
కాంగ్రెస్ పార్టీ తొలిజాబితాను ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. పార్టీ తొలి జాబితాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, భూపాలపల్లి, నర్సం పేట, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవరా ్గలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశమున్నట్లు పార్టీ వర్గా ల్లో ప్రచారం జరుగుతుంది. గత రెండ్రోజులుగా టిపిసిసి నాయకత్వం స్క్రీనింగ్ కమిటీ, ఎన్నికల కమిటీ సమావే శాలు వేగంగా నిర్వహిస్తూ జాబితాను కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ జాబితాకు తుది మెరుగులు దిద్ది ఎఐసిసి ఆమోదముద్రకు ఢిల్లీకి పంపనున్నారు. ఏఐసీసీ నాయకత్వం ఆమోదముద్ర పడగానే తొలి జాబితాను విడుదల చేయడానికి టిపిసిసి నాయకత్వం సన్నద్ధమవుతుంది.