- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మొలుగూరి యాకయ్య గౌడ్ పుట్టినరోజు వేడుకలను మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. యాకయ్య గౌడ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని అఖిలభారత యాదవ మహాసభ మండల అధ్యక్షుడు సలేంద్ర శ్రీనివాస్, ఐలమ్మ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోనె అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమ శ్రీకాంత్, మంగ శోభన్ బాబు, నారగోని ఎల్లయ్య, దౌపాటి రవి, గోగుల సంపత్ కుమార్, గడ్డం వరుణ్, గడ్డం బాబు, కొడిశాల సోమయ్యలు కేక్ కట్ చేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -