- Advertisement -
నవతెలంగాణ – అలంపూర్
అలంపూర్ పట్టణంలోని ఆయా వార్డులో నివాసం ఉన్న దళితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పై కెవిపిఎస్ ఆధ్వర్యంలో సోమవారం సర్వే నిర్వహించారు. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జీ. రాజు మాట్లాడుతూ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమస్యలను పరిష్కరించని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మండల కార్యదర్శి వెంకటస్వామి, నరసింహ, జయన్న తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -