- Advertisement -
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి మున్సిపాలిటీలో పదేళ్లపాటు అధికారం అనుభవించి వ్యవస్థలన్నీ నాశనం చేసి ఇప్పుడు దొంగే దొంగ అన్నట్లుగా మారి మాపై ఆరోపణలు చేస్తున్నారని కల్వకుర్తి మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ మండిపడ్డారు. పట్టణంలో ఆయన స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీడీవో కార్యాలయం వెనుక భాగంలో ఉన్న దాదాపు 750 గజాల స్థలాన్ని బిఆర్ఎస్ నాయకులే అమ్ముకొని కాంగ్రెస్ నాయకుల మీద ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
- Advertisement -