- Advertisement -
నవతెలంగాణ – సదాశివనగర్
మండలం లోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి, మర్కల్ నందు సదాశివ నగర్ పీహెచ్ సి ఆధ్వర్యంలో సి.పి.ఆర్ క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపుకు డాక్టర్ రాధిక రాణి, డాక్టర్ శిరీష, డాక్టర్ అస్మా అఫ్షిన్ విద్యార్థులకు సి పి ఆర్ గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎదుటి వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సిపిఆర్ చేసే విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సి శోభారాణి, వైస్ ప్రిన్సిపాల్ సి హెచ్ మీన, కళాశాల హెల్త్ సూపర్వైజర్ ఆర్ చక్కని లతో పాటుగా అధ్యాపక బృందం పాల్గొన్నారు.
- Advertisement -