Tuesday, May 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి కూలీలకు అండగా దేవరాంపల్లి సర్పంచ్

ఉపాధి కూలీలకు అండగా దేవరాంపల్లి సర్పంచ్

- Advertisement -

ORS ప్యాకెట్లు, తాగునీరు, నిల్వ నీడ ఏర్పాటు
నవతెలంగాణ – కాటారం:-

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మండలం దేవరాంపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల ఆరోగ్య రక్షణకు సర్పంచ్ ఆమని సురేష్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలో పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు ORS ప్యాకెట్లు పంపిణీ చేయడంతో పాటు తాగునీటి సౌకర్యం, నీడ ఏర్పాటు చేశారు.

కూలీలు ఎండలో పని చేస్తూ అలసటకు గురికాకుండా ఉండేందుకు అవసరమైన వైద్య సహాయం కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వేసవి కాలంలో కూలీల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామపంచాయతీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సర్పంచ్ ఆమని సురేష్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూ, ఎండల్లో తమ సమస్యలను గుర్తించి తాగునీరు, ORS ప్యాకెట్లు అందించడం అభినందనీయమని తెలిపారు. గ్రామస్థులు కూడా సర్పంచ్ చేపట్టిన చర్యలను ప్రశంసించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -