నవతెలంగాణ – జుక్కల్
విద్యతోనే ఉజ్వల భవిషత్ ఉంటుందని వజ్రకండి సర్పంచ్ సింత్రాళే సావిత్రి సోపాన్ అన్నారు. గ్రామంలోని ఎంపియూపీఎస్ ప్రధానోపాధ్యాయుడు బాబు ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్పంచ్ పాల్గోన్నారు. విద్యా శాఖ ఆదేశాలతో పాఠశాలలోని విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలను అందజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామమలో ఐదేండ్లు పూర్తయిన పిల్లలందరూ తప్పకుండా ప్రభూత్వ బడుల్లో చేరాలని పిలుపునిచ్చారు. పిల్లలతో పనులు చేయించొద్దని, బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపాలని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉదయం రాగీజావా, సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, జిపి కార్యదర్శి, పాలకవర్గం సభ్యులు, హెచ్ ఎం , ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



