నవతెలంగాణ-చిన్నగూడూరు
మండల కేంద్రంలోని ఆకేరు వాగులో మోటర్లు ఏర్పాటు చేసుకొని సాగు చేసుకుంటున్న చిన్నగూడూరుకు చెందిన పసునాది రజిత, కోల సతీష్, ఉగ్గంపెళ్లి గ్రామానికి చెందిన భర్తపురపు వెంకటేశ్వర్లు ముగ్గురు రైతుల సుమారు రూ.90 వేల విలువగల వ్యవసాయ మోటార్లను శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ చోరీ తో ఆకేరు వాగులో మోటర్లు ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేసుకునే రైతులకు చీడ పీడల నుండి పంటను కాపాడుకోవడంతో పాటు మరో చిక్కు వచ్చి పడింది వ్యవసాయ మోటార్లు ఎత్తుకెళ్తుండడంతో తమ మోటార్లను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు చోరీకి గురైన మోటార్ల రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌లోఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.